కార్పొరేట్ కళాశాలలు టెక్నో స్కూళ్లలో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు

0
120

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ..ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యంగా ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ ప్రాంతంలోని నారాయణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ తదితర కాలేజీలలో విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తే చర్యలు తప్పవని కార్పొరేట్ యాజమాన్యాలను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు.

కార్పొరేట్ కళాశాలలు స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నారాయణ శ్రీ చైతన్య కళాశాలలు టెక్నో స్కూల్ల ప్రిన్సిపాల్ లను కలిసి సమస్యను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలు స్కూళ్ల యాజమాన్యాల దోపిడీపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ దృష్టికి అదే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యంగా
ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ ప్రాంతంలోని కార్పొరేట్ కళాశాలలు స్కూళ్లలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారని ఆయన గుర్తు చేశారు.

ట్యూషన్ ఫీజు లంటూ పుస్తకాలు షూస్ కంప్యూటర్ తదితరాలంటూ అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులలో తప్పనిసరిగా కన్సేషన్ రాయితీ కల్పించాలని సంబంధిత యాజమాన్యాలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు చర్లపల్లి కాలనీల సమాఖ్య సీసీఎస్ ప్రతినిధులు కాసం మైపాల్ రెడ్డి, ఎంపల్లి పద్మా రెడ్డి, నేమూరి మహేష్ గౌడ్, నవీన్ గౌడ్, నాగేశ్వరరావు, రాజేశ్వర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జంపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.