విశాలాంధ్ర దినపత్రికలో మొదలైన నా ప్రయాణం నేడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు
మాభూమి టైమ్స్ వెబ్ డేస్క్:
విజయవాడ చుట్టుగుట్ట చండ్ర రాజేశ్వరరావు భవన్ లో ముప్పడ నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన విశాలాంధ్ర 72వ వార్షికోత్సవంనికీ సభలో ముఖ్య అతిథిగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన .మాట్లాడుతూ విశాలాంధ్ర దినపత్రికలో మొదలైన నా ప్రయాణం నేడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిదని,ఎంతో మంది పాత్రికేయులకు కర్మాగారం విశాలాంధ్ర,దేశ స్వాతంత్ర్యం,నిరంకుశత్వం నుండి ప్రజలను చైతన్యవంతం చేయడానికి స్థాపించచబడిన విశాలాంధ్ర 1952లో ఏర్పాటు చేసి,రాఘవాచారి, చండ్ర రాజేశ్వరరావు,లాంటి మహనుభావులు వారి ఆస్తులను సైతం ధారపోసి నడిపించుకున్నారు ఇలాంటి పత్రికకు మరింత ఆదరణ పొందాలని, ఈ సందర్భంగా విశాలాంధ్ర దినపత్రికలో పనిచేస్తున్న పాత్రికేయులకు,చూస్తున్న ప్రజలకు విశాలాంధ్ర 72వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర కార్యదర్శి జల్లి విల్సన్, సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,రామారావు, కోశాధికారి ఓబులేషు,దుర్గ భవాని,తదితరులు ఉన్నారు