– పెండింగ్ లో ఉన్న హిరింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి
*హీరింగ్ కేసులకు జరిమానాలు విధించాలి
– సదస్సులు, సమావేశాలు లలో భాగస్వాములు కావాలి
—*- FRTI ప్రశ్నకు ఆమోదం తెలిపిన కమిషనర్ రెహానా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ నేతృత్వంలో బృందం నూతన రాష్ట్ర సమాచార కమిషనర్ రెహానా బేగం కు శుభాకాంక్షలు తెలిపింది.
సీనియర్ జర్నలిస్టు గా సమాజానికి సేవ చేసిన మీరు ఆర్టీఐ ద్వారా నిజాయితీ గల హిరింగ్ కేసులలో పీఐఓ లపై జరిమానాలు విధించాలని చంద్రమోహన్ కోరారు. వేల సంఖ్యలో వున్న కేసులను తగ్గించాలని కోరారు.
ఆర్టీఐ నీ ప్రజల్లో,అధికారులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా రిటైర్డు కమిషనర్ జనార్దనరావు హాట్ సీటు లో వున్న మీరు ..హిరింగ్ కేసులలో అర్జిదారుడికి దూరాన్ని బట్టి చార్జీలు పీఐ ఓ ద్వారా ఇప్పించారని ఆ విధానం కొనసాగించాలని కోరారు. జాతీయ ఉపాధ్యక్షులు మట్ట ప్రసాద్, ఏపీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ విక్టర్ పాల్, అశోక్ కుమార్ వున్నారు.