జీవో నెంబర్ త్రీ ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొని రావాలి
షెడ్యూల్ తెగలను కాపాడే బాధ్యత కమిషన్ దే
టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్
భద్రాచలం ఐటీడీఏ లో షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటన సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో షెడ్యూల్ తెగలు సమస్యలను పరిష్కారం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో నూతన అటవీ చట్టాన్ని రద్దుచేయాలని. పోడు సాగుదారులందరికీ 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్లారు, అదేవిధంగా జీవో నెంబర్ 3 ని ఆర్డినెన్స్ ద్వారా చట్ట రూపకల్పన చేయాలని ఆయన డిమాండ్ చేశారు, ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ కులాలు వెనుకబడిన ప్రాంతంలో సాగునీరు తాగునీరు విద్య వైద్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయింపు చేసే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు, 1989 ఎస్సీ ఎస్టీ అటార్సిటీ యాక్ట్ ఉన్నప్పటికీ ఇంకా ఆదివాసీల పైన అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న ఆదివాసీల స్థితిగతులు మార్పు రాలేదని ఏజెన్సీ ప్రాంతంలో అనేకమంది ఆదివాసి నిరుద్యోగులు ఉద్యోగులు లేక ఖాళీగా ఉన్నారని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదని దీనిమీద షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ దృష్టిసాదించాలని ఈ సందర్భంగా సూచన చేశారు, అదేవిధంగా గత 40 సంవత్సరాల క్రితం సతీష్ గాడ్ నుండి వచ్చిన ఆదివాసులకు ఎస్ టి కోయా సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఆ గ్రామాలకు కరెంటు రోడ్లు సౌకర్యాలు కూడా కల్పించాలని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షులు గౌరీ నాగేశ్వరరావు భద్రాచలం టౌన్ అధ్యక్ష కార్యదర్శులు సోయం జోగారావు కుంజ శ్రీను రవి మడివి రమేష్ ఇంకా తదితరులు పాల్గొన్నారు